ఐపీఎల్ 16వ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగనుంది. ప్లే ఆఫ్స్ షెడ్యూల్‌ను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. మే 23 నుంచి 28 వరకు ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం మే 23, 24వ తేదీల్లో క్వాలిఫయర్1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మే 26న క్వాలిఫయర్2 జరగనుంది. అక్కడే ఫైనల్ కూడా జరగనుంది. మే 28న ఫైనల్ నిర్వహించనున్నారు.
1,32,000 మంది సామర్థ్యం కలిగిన గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ అయిన అహ్మదాబాద్ ఐపీఎల్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది వరుసగా రెండోసారి. 2022 సీజన్‌లో అహ్మదాబాద్ లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య క్వాలిఫైయర్ 2ని కూడా నిర్వహించారు. చెన్నై 2019 తర్వాత తొలిసారిగా IPL ప్లేఆఫ్ గేమ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
లీగ్ దశ ముగిసే సమయానికి, మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫయర్ 1లో ఆడతాయి. గెలిచిన జట్టు డైరెక్ట్ గా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు ఆ తర్వాత ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో క్వాలిఫైయర్ 2 ఆడుతుంది. క్వాలిఫయర్ 2 విజేత ఫైనల్‌కు చేరుకుంటారు.
IPL 2023 ప్లే-ఆఫ్‌ల షెడ్యూల్ :
మే 23 - క్వాలిఫైయర్ 1 (చెన్నై)
మే 24 - ఎలిమినేటర్ (చెన్నై)
మే 26 - క్వాలిఫైయర్ 2 (అహ్మదాబాద్)
మే 28 - ఫైనల్ (అహ్మదాబాద్)