కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. సగం మ్యాచ్‌లు పూర్తి కాగా.. మిగిలిన సగం సీజన్‌ను పూర్తి చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా మిగిలిన సీజన్‌ను యూఏఈలో నిర్వహించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 18, 19 వారాంతరంలో ఆ రెండు రోజుల్లో లీగ్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్‌ను అక్టోబర్ 9 లేదా 10 తేదీల్లో జరగొచ్చు. ఈ నెల 29న జరిగే బోర్డు ప్రత్యేక సర్వ సభ్యసమావేశంలో లీగ్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో పాటు ఇంగ్లాండ్ సిరీస్ కోసం భారత జట్టు జూన్ 2 న ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 14న ముగియనుంది. దాంతో ఆటగాళ్లు సెప్టెంబర్ 15న యూఏఈ చేరుకొని మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ సిరీస్ ముగిసిన వెంటనే రెండు జట్లోని ఐపీఎల్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో యూఏఈ చేరుకోనున్నారని.. సెప్టెంబర్ 18 లేదా 19 నుంచి ఐపీఎల్ మిగిలిన సీజన్‌ను ప్రారంభం కానుందని బీసీసీఐలోని ఓ అధికారి తెలిపారు. పది రోజులు రెండేసి మ్యాచ్‌లు. మిగతా ఏడు లీగ్ మ్యాచ్‌లను క్వాలిఫయర్స్, ఫైనల్‌ను రోజుకో మ్యాచ్ చొప్పున నిర్వహిస్తామన్నారు. షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు వివరించారు.