చెన్నై వేదికగా ఐపీఎల్‌ వేలం.. ఎప్పుడంటే..?

IPL 2021 Player Auction on 18th February. ఐపీఎల్‌-2021 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ ఆట‌గాళ్ల‌ వేలం నిర్వ‌హించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఈ వేలం జ‌రుగ‌నుంది.

By Medi Samrat  Published on  27 Jan 2021 6:29 PM IST
IPL 2021 Player Auction on 18th February

ఐపీఎల్‌-2021 సీజన్‌కు సంబంధించి బీసీసీఐ ఆట‌గాళ్ల‌ వేలం నిర్వ‌హించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా ఈ వేలం జ‌రుగ‌నుంది. ఈ మేరకు ఐపీఎల్‌ ట్విటర్ అకౌంట్‌లో ఈ విషయాన్ని ప్ర‌క‌టించారు. ఇదిలావుంటే.. ఇప్పటికే ఐపీఎల్‌లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీలు.. రిటైన్‌, రిలీజ్‌డ్‌‌ ఆటగాళ్ల లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఆయా ఫ్రాంచైజీలు స్టార్‌ ఆటగాళ్లను రిలీజ్‌ చేయడంతో.. వారు కూడా 2021 ఐపీఎల్‌ సీజన్‌కు వేలంలోకి రానున్నారు. 8 ఫ్రాంచైజీలు మొత్తం 139 మంది ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోగా.. 57 మందిని రిలీజ్‌ చేశాయి. కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ 13వ సీజన్‌ యూఏఈ వేదికగా జరిగినా.. ఈ ఏడాది మాత్రం భారత్‌లోనే నిర్వహించడానికి బీసీసీఐ భావిస్తుంది.

ఈ విష‌య‌మై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ఐపీఎల్‌ 14వ సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే స్పష్టం చేశారు. బీసీసీఐ.. ఏప్రిల్‌- మే నెలల్లో ఐపీఎల్‌ నిర్వహించాలని భావిస్తున్న తేదీలతో పాటు ఎక్కడ నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌కు 50 శాతం ప్రేక్షకులతో మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌కు అనుమతి ఇచ్చింది. ఈ నేఫ‌థ్యంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు కూడా ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు పుష్క‌లంగానే ఉన్నాయి.


Next Story