రేపే ఐపీఎల్ వేలం.. ఏ టీమ్ ఎంత మందిని తీసుకోవచ్చు..? ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందంటే..?
IPL 2021 auction remaining player slots and available budget of all teams.చెన్నై వేదికగా రేపు ఇండియన్ ప్రీమియర్ లీగ్
By తోట వంశీ కుమార్ Published on 17 Feb 2021 3:57 PM ISTచెన్నై వేదికగా రేపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 కోసం భారత క్రికెట్ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నాం 3 గంటల నుంచి ఈ వేలం ప్రారంభంకానుంది. మొత్తం 1,114 మంది ఆటగాళ్లు వేలం కోసం తమ పేర్లు నమోదు చేసుకోగా.. ఆయా ప్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 164 మంది ఇండియన్ ప్లేయర్లు కాగా.. 125 మంది విదేశీ ప్లేయర్లు ఉండగా... మరో ముగ్గురు అసోసియేట్ దేశాల ప్లేయర్లు ఉన్నారు. కాగా.. ఈ 292 మంది ఆటగాళ్లలోంచి 61 మంది ఆటగాళ్లను మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి.
రూ.2కోట్ల బేస్‌ప్రైస్‌తో హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ ప్లంకెట్, జాసన్ రాయ్, మార్క్ వుడ్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు అందుబాటులో ఉండడంతో వేలంపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏ టీమ్ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఏ టీమ్‌కు ఎంత మంది ప్లేయర్స్ తీసుకునే అవకాశం ఉందో ఓ సారి చూద్దాం.
ఢిల్లీ క్యాపిటల్స్..
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 8
డబ్బు: రూ.13.04 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్..
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 8
డబ్బు: రూ.10.75 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్..
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 6
డబ్బు : రూ.19.9 కోట్లు
ముంబై ఇండియన్స్..
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 7
డబ్బు: రూ.15.35 కోట్లు
రాజస్థాన్ రాయల్స్..
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 9
డబ్బు : రూ.15.35 కోట్లు
పంజాబ్ కింగ్స్..
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 9
డబ్బు: రూ.53.2 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు..
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 14
డబ్బు: రూ.35.4 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్..
వేలంలో ఎంతమందిని తీసుకోవచ్చు : 3
డబ్బు: రూ.10.75 కోట్లు
అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 14 మంది ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉండగా.. అత్యల్పంగా హైదరాబాద్ ముగ్గురిని మాత్రమే తీసుకునే వీలుంది.