భారత్ vs న్యూజిలాండ్ తొలి టీ20.. ఆసక్తికర విశేషాలు ఎంటంటే..?
Interesting stats from the 1st India VS New Zealand T20I.న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు టీ20 సిరీస్‌లో
By తోట వంశీ కుమార్ Published on 18 Nov 2021 1:02 PM ISTన్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. బుధవారం రాత్రి జైపూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ గుప్టిల్ (70), మార్క్ చాప్‌మన్(63) లు రాణించారు. అనంతరం 165 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేదించింది. చేధనలో ఓపెనర్ రోహిత్ శర్మ (48; 36 బంతుల్లో 5 పోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(62; 40 బంతుల్లో 6పోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా ఆడారు. ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులు నమోదు అయ్యాయి. అవేటంటే..
అత్యధిక అర్థశతక భాగస్వామ్యాలు నెలకొల్పిన జంట
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించారు. టీ20ల్లో భారత్ తరుపున అత్యధిక సార్లు అర్థశతక బాగస్వామ్యం నెలకొల్పిన జంటగా రికార్డులకు ఎక్కారు. వీరిద్దరు 26 ఇన్నింగ్స్‌ల్లో 12 సార్లు ఈ ఘనత సాధించారు. అంతకముందు ఈ ఘనత రోహిత్, ధావన్ పేరిట ఉండేది. రోహిత్, ధావన్‌లు 52 ఇన్నింగ్స్‌ల్లో 11 సార్లు ఈ ఘనత సాధించారు.
ధోని 11, పంత్ తొలిసారి..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ క్యాలెండర్ ఇయర్ 1000 పరుగులు చేసిన భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా పంత్ నిలిచాడు. కాగా.. భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వరుసగా 11 సార్లు ఈ ఘనత అందుకున్నాడు. అతడు 2005 నుంచి 2017 మధ్య దీన్ని సాధించాడు.
ఐదేళ్ల తరువాత స్వదేశంలో ఆడిన అశ్విన్..
సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఐదేళ్ల తరువాత స్వదేశంలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. చివరగా అతడు 2016 టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన జైపూర్ క్రికెట్ గ్రౌండ్ తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌కు అతిథ్యమిచ్చింది.