న్యూజిలాండ్‌తో మూడో టీ20కు ముందు ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మూడో టీ20కు దూరమయ్యాడు. వార్నర్ ప్రస్తుతం తుంటి గాయంతో బాధపడుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. రెండో టీ20కు విశ్రాంతి తీసుకున్న వార్నర్.. ఇప్పుడు మూడో టీ20 నుంచి తప్పుకున్నాడు.
జూన్‌లో జరిగే T20 ప్రపంచ కప్ తర్వాత అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ల నుండి రిటైర్ అవుతున్న 37 ఏళ్ల వార్నర్.. ఐపీఎల్ లో అయితే ఆడుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. వార్నర్ కు రికవరీకి చాలా తక్కువ సమయం మాత్రమే కావాలని.. ICC పురుషుల T20 ప్రపంచ కప్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు అందుబాటులో ఉంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది.కి వీస్‌తో జరిగిన తొలి టీ20లో వార్నర్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 20 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వార్నర్ ప్రాతినిథ్యం వహిస్తూ ఉన్నాడు.