రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్..!

గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగ‌నున్న మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ త‌గిలింది.

By Medi Samrat
Published on : 21 April 2025 6:30 PM IST

రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్..!

గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగ‌నున్న మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌కు రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ దూర‌మ‌య్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ పక్కటెముకకు గాయమైంది. దీంతో వరుసగా రెండో మ్యాచ్‌కు దూర‌మ‌వ‌నున్నాడు. శాంసన్ ప్రస్తుతం జైపూర్‌లో పునరావాసం పొందుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ వైద్య సిబ్బంది ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని ఫ్రాంచైజీ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆ ప్రకటనలో ఇంకా మాట్లాడుతూ.. 'పునరావాస ప్రక్రియ కారణంగా రాబోయే మ్యాచ్ కోసం సంజూ బెంగళూరుకు వెళ్లడం లేదు. టీమ్ మేనేజ్‌మెంట్ అతని పురోగతిని నిశితంగా పరిశీలిస్తోంది. అతడు తిరిగి ఆటలోకి రావడానికి మ్యాచ్-బై-మ్యాచ్ విధానాన్ని అవలంబిస్తోంది.

సంజూ శాంసన్‌ గైర్హాజరీతో రాజస్థాన్‌ రాయల్స్‌కు రియాన్‌ పరాగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. IPL 2025 ప్రారంభంలో కూడా రియాన్ పరాగ్ రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సమయంలో శాంసన్ వేలి గాయం నుండి కోలుకుంటున్నాడు. కెప్టెన్‌గా, పరాగ్ 147.88 స్ట్రైక్ రేట్‌తో నాలుగు మ్యాచ్‌ల్లో 105 పరుగులు చేశాడు.

సంజూ శాంసన్ టోర్నీని బ్యాట్స్‌మెన్‌గా ప్రారంభించాడు. హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 బంతుల్లో 66 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. సంజూ ఢిల్లీపై 19 బంతుల్లో 31 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. సూపర్ ఓవర్‌లో అతడు మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు.

సంజూ శాంసన్ గైర్హాజరీతో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ జ‌ట్టులోకి వ‌చ్చాడు. బెంగళూరులో యశస్వి జైస్వాల్‌తో కలిసి సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్‌కు బ్యాంగ్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు.

కెప్టెన్ సంజూ శాంసన్ వరుస మ్యాచ్‌లు ఆడకపోవడం రాయల్స్‌కు భారీ నష్టాన్ని కలిగిస్తోంది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడి రెండు మాత్రమే గెలిచి 4 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.

Next Story