వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌.. కోహ్లీ, బుమ్రా దూరం

India's T20I squad for West Indies series announced.స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లేకుండానే విండీస్‌తో టి20

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2022 10:28 AM GMT
వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌.. కోహ్లీ, బుమ్రా దూరం

స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లేకుండానే విండీస్‌తో టి20 సిరీస్‌కు భార‌త జ‌ట్టును సెల‌క్ట‌ర్లు ప్ర‌క‌టించారు. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 18 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్ర‌క‌టించింది. ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, బుమ్రాల‌కు విశాంత్రి ఇచ్చారు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, కుల్‌దీప్ యాద‌వ్‌ల‌కు చోటు ద‌క్కింది. గాయం కార‌ణంగా దూర‌మైన కేఎల్ రాహుల్ విండీస్ ప‌ర్య‌ట‌న‌కు ఎంపిక‌య్యాడు. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా, వైస్ కెప్టెన్‌గా రాహుల్‌ను నియ‌మించారు. విండీస్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు మూడు వ‌న్డేలు, 5 టి20లు ఆడ‌నుంది. ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌లో పాల్గొనే జ‌ట్టును ప్ర‌క‌టించ‌గా, తాజాగా టి20 సిరీస్‌లో ఆడ‌నున్న ఆట‌గాళ్ల‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు.

భార‌త జ‌ట్టు : రోహిత్ శ‌ర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిష‌న్, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాద‌వ్, దీపక్ హూడా, శ్రేయాస్ అయ్య‌ర్, దినేశ్ కార్తీక్, రిష‌బ్ పంత్, హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్‌ ప‌టేల్‌, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, బిష్ణోయి, కుల్దీప్ యాద‌వ్, భువ‌నేశ్వ‌ర్ కుమార్, అవేశ్ ఖాన్, హ‌ర్ష‌ల్ ప‌టేల్, అర్ష్‌దీప్ సింగ్.

Next Story
Share it