సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు తేజం కోనేరు హంపి

ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్‌ను ఓడించి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను కోనేరు హంపీ గెలుచుకుంది.

By అంజి  Published on  29 Dec 2024 3:00 PM IST
India, Koneru Humpy, Rapid chess world champion

సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు తేజం కోనేరు హంపి 

ఇండోనేషియాకు చెందిన ఐరీన్ సుకందర్‌ను ఓడించి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను కోనేరు హంపీ గెలుచుకుంది. ర్యాపిడ్ చెస్‌లో చారిత్రాత్మక రెండవ ప్రపంచ టైటిల్‌తో దేశానికి గర్వకారణంగా నిలిచింది. గతంలో 2019లో జార్జియాలో టైటిల్‌ను గెలుచుకున్న హంపీ, ఈ ఫార్మాట్‌లో బహుళ ఛాంపియన్‌షిప్‌లను సాధించిన ఏకైక ప్లేయర్ గా చైనాకు చెందిన జు వెన్‌జున్‌ సరసన చేరింది.

ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలవడానికి చివరి రౌండ్‌కు ముందు, ఆరుగురు క్రీడాకారులు – జు వెన్‌జున్, కాటెరినా లగ్నో, హరికా ద్రోణవల్లి, అఫ్రూజా ఖమ్‌దమోవా, టాన్ ఝోంగీ, ఐరీన్ 7.5 పాయింట్లతో హంపితో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. అన్ని టాప్ బోర్డ్‌లలోని మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. అయితే టైటిల్‌ను కైవసం చేసుకోవడానికి హంపీ చివరి రౌండ్‌లో ఐరీన్‌పై గెలిచింది.

Next Story