Video : భార‌త జెండా ఎందుకు పెట్ట‌లేదు..? ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తీవ్ర వివాదం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందే ఓ తీవ్ర వివాదం తలెత్తింది.

By Medi Samrat  Published on  17 Feb 2025 10:51 AM IST
Video : భార‌త జెండా ఎందుకు పెట్ట‌లేదు..? ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తీవ్ర వివాదం

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందే ఓ తీవ్ర వివాదం తలెత్తింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. పాకిస్థాన్‌లోని కరాచీ స్టేడియంలో టోర్నీలో పాల్గొంటున్న‌ అన్ని దేశాల జెండాలను అమర్చారు.. కానీ భారతదేశ జెండాను ఏర్పాటు చేయలేదు. ICC నిబంధనల ప్రకారం.. ఏదైనా దేశం బహుళజాతి టోర్నమెంట్‌ను నిర్వహిస్తే.. ఆ టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల జెండాలను ప్రదర్శించాలి.. అయితే 8 దేశాలలో, 7 దేశాల జెండాలు మాత్రమే స్టేడియంలో కనిపిస్తున్నాయి. దీంతో కొత్త వివాదం మొదలైంది.

ఇది పాకిస్తాన్ సిగ్గుచేటు చర్యగా అభివ‌ర్ణిస్తున్నారు నెటిజ‌న్లు. దీంతో ఈ విష‌యం తీవ్ర‌ చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.. అయితే వైరల్ వీడియో కారణంగా సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. కరాచీ స్టేడియం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ టోర్నీ ప్రారంభానికి ముందు కరాచీ స్టేడియంలో భారత జెండాను ఉంచకపోవడంపై వివాదం నెలకొంది. భారత జట్టు ఈ గ్రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడదు.. అందుకే భారత జెండాను పెట్టలేదని పాక్ అభిమానులు అంటుండ‌గా.. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లు కూడా ఆ మైదానంలో తమ మ్యాచ్‌లు ఆడటం లేదని, వారి జెండాలు మాత్రం పెట్టారని భార‌త అభిమానులు అంటున్నారు. ఈ విష‌య‌మై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీసీబీపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా, టోర్నమెంట్ హైబ్రిడ్ మోడ్‌లో ఆడాలని నిర్ణయించారు. దీంతో భారత జట్టు తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఈ నమూనా ప్రకారం.. భారత్ నాకౌట్ రౌండ్‌కు అర్హత సాధిస్తే.. సెమీ-ఫైనల్, ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడాల్సి ఉంటుంది.

Next Story