అరే ఏవీ మ‌న‌సులో పెట్టుకోకు.. ఎలాగైనా గెల‌వండి రా.. అఫ్గాన్‌ పై మీమ్స్ వైర‌ల్‌

Indian fans hilarious memes on Afghanistan vs New Zealand Match.ప్ర‌స్తుతం కోట్లాది మంది భార‌తీయులు కోరుకుంటుంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Nov 2021 7:50 AM GMT
అరే ఏవీ మ‌న‌సులో పెట్టుకోకు.. ఎలాగైనా గెల‌వండి రా.. అఫ్గాన్‌ పై మీమ్స్ వైర‌ల్‌

ప్ర‌స్తుతం కోట్లాది మంది భార‌తీయులు కోరుకుంటుంది ఒక‌టే. అదే న్యూజిలాండ్ పై అఫ్గానిస్థాన్ గెల‌వాల‌ని. అప్గాన్ విజయం కోసం పూజ‌లు కూడా చేస్తున్నారు. అఫ్గాన్ గెలిస్తే భార‌త్ సెమీస్‌కు చేరే అవ‌కాశం ఉండ‌డ‌మే అందుకు కార‌ణం. గ్రూప్‌-2 నుంచి పాకిస్థాన్ ఇప్ప‌టికే సెమీస్ చేరుకోగా.. మిగిలిన ఒక్క స్థానంలో కోసం కివీస్‌, అఫ్గాన్‌, భార‌త్ పోటీ ప‌డుతున్నాయి. భార‌త్, అప్గానిస్థాన్ చెరో 4 పాయింట్ల‌తో మూడు స్థానాల్లో ఉండ‌గా.. కివీస్ 6 పాయింట్లతో కొన‌సాగుతోంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిస్తే.. భార‌త్ త‌న చివ‌రి మ్యాచ్ లో న‌మీబియాపై విజ‌యం సాధిస్తే.. అప్పుడు ఇరు జ‌ట్లు కూడా 6 పాయింట్ల‌తో ఉంటాయి. మెరుగైన ర‌న్‌రేట్ ఉన్న జ‌ట్టు సెమీస్‌లో అడుగుపెడుతుంది. ర‌న్‌రేట్ ప‌రంగా చూసుకుంటే భార‌త్ మెరుగ్గా ఉంది. దీంతో అఫ్గాన్ విజ‌యం సాధిస్తే భార‌త్ సెమీస్‌లో అడుగుపెట్ట‌డం చాలా సుల‌భం అవుతుంది ఒక‌వేళ అఫ్గాన్ ఓడిపోతే.. ఇక అంతే సంగ‌తులు. బ్యాగ్ స‌ర్ద‌కుని టీమ్ఇండియా ఆట‌గాళ్లు భార‌త్‌కు రావాల్సిందే.

ఈ నేప‌థ్యంలో అఫ్గాన్ గెల‌వాలంటూ సోష‌ల్ మీడియాలో మీమ్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి. అందులో అమ్మనాన్న ఓ త‌మిళ అమ్మాయి చిత్రంలోని బాక్సింగ్ సీన్ స్పూప్ గా చేసుకుని చేసిన మీమ్ ఆక‌ట్టుకుంటోంది. బాబ్చాబు.. ఇవేవీ మ‌న‌సులో పెట్టుకోకురా.. న్యూజిలాండ్‌పై గెల‌వ‌రా.. అంటూ రూపొందించిన మీమ్ న‌వ్వులు పూయిస్తోంది. అలాగే మరికొన్ని మీమ్‌లు మీకోసం

Next Story
Share it