ప్రియురాలిని పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెట‌ర్‌

Indian Cricketer Axar Patel Married To Meha Patel In Vadodara. ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ ఓ ఇంటివాడు అయ్యాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2023 12:36 PM IST
ప్రియురాలిని పెళ్లాడిన టీమ్ఇండియా క్రికెట‌ర్‌

భార‌త క్రికెట‌ర్లు వ‌రుస‌గా పెళ్లి పీట‌లు ఎక్కుతున్నారు. ఇటీవ‌ల ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ త‌న ప్రియురాలు అతియా శెట్టిని వివాహం చేసుకోగా తాజాగా ఆల్‌రౌండ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ ఓ ఇంటివాడు అయ్యాడు. గురువారం త‌న చిన్న‌నాటి స్నేహితురాలు, న్యూట్రిష‌నిస్ట్‌, డైటీషియ‌న్ అయిన మెహా ప‌టేల్ తో వివాహా బంధంలోకి అడుగుపెట్టాడు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాల‌తో వ‌డోద‌ర‌లో వీరి వివాహా వేడుక జ‌రిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

చాలా కాలంలో మెహాతో అక్ష‌ర్ ప్రేమ‌లో ఉన్నాడు. పోయిన సంవ‌త్స‌రం త‌న పుట్టిన రోజున ఆమె చేతికి ఉంగ‌రం తొడిగి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఏడాది త‌రువాత పెళ్లి చేసుకుని వైవాహిక బంధంతో అడుగుపెట్టాడు.

పెళ్లి కార‌ణంగా కివీస్‌తో స్వదేశంలో జ‌రుగుతున్న వ‌న్డే, టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్నాడు అక్ష‌ర్ ప‌టేల్‌. అంత‌క‌ముందు శ్రీలంక‌తో టీ20, వ‌న్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. అటు బంతితో పాటు ఇటు బ్యాటింగ్‌లో రాణించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. లంక‌తో జ‌రిగిన రెండో టీ20లో (31 బంతుల్లో 65 ప‌రుగులు) చిర‌స్మ‌ర‌ణీయ ఇన్నింగ్స్ ఆడాడు.



Next Story