గులాబీ టెస్టులో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం

India win by 10 wickets.ప్ర‌పంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన పింక్ బాల్ టెస్టులో భార‌త్ ఘ‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Feb 2021 8:31 PM IST
గులాబీ టెస్టులో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం

ప్ర‌పంచంలోని అతి పెద్ద క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన పింక్ బాల్ టెస్టులో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. 49 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అల‌వోక‌గా చేదించింది. 10 వికెట్ల‌తో మూడో టెస్టులో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. ఓపెన‌ర్లు రోహిత్ శర్మ 3 ఫోర్లు 1 సిక్స్ తో 25 పరుగులు చేయగా, శుభ్ మ‌న్‌ గిల్ 1 ఫోరు, 1 సిక్స్ తో 15 పరుగులతో ప్ర‌త్య‌ర్థికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా జ‌ట్టును భారీ విజ‌యాన్ని అందించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1తో భార‌త్ ముంద‌జంలో ఉంది.

ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్‌ ముగ్గురు పేసర్లను తీసుకుని వ్యూహాత్మకంగా దారుణమైన తప్పిదానికి పాల్పడింది. పిచ్ పేస్ కు సహకరించకపోగా.. తొలి రోజు నుంచే స్పిన్నర్లకు తోడ్పాటు అందించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 112 పరుగులు చేయగా, భారత్ 145 పరుగులు చేసింది. ఆపై ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 81 పరుగులకే చేతులెత్తేసింది. భారత్‌కు 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. 49 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ 7.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు తీయ‌గా.. అశ్విన్ 7 వికెట్ల‌తో స‌త్తా చాటాడు. ఇరుజట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు మార్చి 4 నుంచి ఇదే మైదానంలో జరగనుంది.




Next Story