భారత క్రికెట్ జట్టు అద్భుతమైన బ్యాటింగ్ చేస్తేనే పూణే టెస్ట్ మ్యాచ్ లో నిలబడగలదు. భారతజట్టు ముందు కివీస్ 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మొదటి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసిన న్యూజిలాండ్, సెకండ్ ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 156 పరుగులు మాత్రమే చేయడంతో కివీస్ భారత్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఛేజ్ చేయడానికి సమయం చాలా ఉన్నా.. పిచ్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే భారత్ ముందు భారీ లక్ష్యమే ఉంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత్ చేరాలంటే ఈ మ్యాచ్ లో గెలుపు భారత్ కు చాలా ముఖ్యం.
కివీస్ సెకండ్ ఇన్నింగ్స్ లో 69.4 ఓవర్లలో 255 పరుగులు చేసింది. టామ్ లాథమ్ 86 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బ్లాండెల్ 41, ఫిలిప్స్ 48 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీయగా, జడేజా 3, అశ్విన్ కు 2 వికెట్లు లభించాయి. ఈ ఉదయం న్యూజిలాండ్ తమ చివరి 5 వికెట్లను కేవలం 57 పరుగులకే కోల్పోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను గంటలోపే ముగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అనుకున్నట్లుగా విజయం సాధించింది. అయితే మ్యాచ్ లో విజయం సాధిస్తుందో లేదో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది.