బంగ్లా పులులు.. ఒక్క సెషన్ లోనే!!

భారతజట్టు చెన్నైలో బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించింది. మూడు రోజులు, ఒక సెషన్‌లో మ్యాచ్‌ను ముగించింది.

By అంజి  Published on  22 Sep 2024 8:30 AM GMT
India vs Bangladesh, Test Match, R Ashwin, Cricket, BCCI

బంగ్లా పులులు.. ఒక్క సెషన్ లోనే!! 

భారతజట్టు చెన్నైలో బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించింది. మూడు రోజులు, ఒక సెషన్‌లో మ్యాచ్‌ను ముగించింది. అశ్విన్ ఆల్‌రౌండ్ షో కారణంగా భారత్ 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో కాస్త మెరుగ్గా ఆడింది. ఆదివారం మొదటి గంట తర్వాత బంగ్లాదేశ్ జట్టులో ఎలాంటి పోటీ కనిపించలేదు. అశ్విన్ ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాతో కలిసి తొమ్మిది వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేశాడు.

ఈ మ్యాచ్ లో భారత జట్టు 280 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా, జడేజా మూడు, బుమ్రా ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్సింగ్స్ లో భారత జట్టు 287 పరుగులు చేసి డిక్లరేషన్ ఇచ్చింది. బంగ్లా బ్యాట్స్ మెన్ లలో నజ్ముల్ హుస్సేన్ శాంటో ఒక్కడే కాస్త గట్టిగా పోరాడాడు. 82 పరుగులు సాధించాడు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసిన అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

2012 నుండి భారతజట్టు స్వదేశంలో టెస్టు సిరీస్ ను కోల్పోలేదు. భారత్ ఇప్పుడు స్వదేశంలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయి 4302 రోజులు గడిచిపోయింది. చెన్నైలో విజయంతో, భారతదేశం కూడా మొదటిసారిగా (179-178) టెస్ట్ క్రికెట్‌లో విజయాలతో తమ ఓటములను అధిగమించింది. ఇప్పటికే సిరీస్‌లో పైచేయి సాధించిన భారత్, సెప్టెంబర్ 27న నాగ్‌పూర్‌లో జరిగే రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.

Next Story