ముగిసిన తొలి రోజు ఆట‌.. టీమిండియా స్కోరు 278/6

India vs Bangladesh 1st Test Day 1. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి రోజున పర్వాలేదనిపించింది.

By M.S.R  Published on  14 Dec 2022 12:39 PM GMT
ముగిసిన తొలి రోజు ఆట‌.. టీమిండియా స్కోరు 278/6

బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా తొలి రోజున పర్వాలేదనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 278 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పుజారా (90) సెంచరీని కోల్పోయాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టును పుజారా, శ్రేయాస్ అయ్యర్ జోడీ ఆదుకుంది. పుజారా 203 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లతో 90 పరుగులు చేసి లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 169 బంతుల్లో 10 ఫోర్లతో 82 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీ కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. కోహ్లీని తైజుల్ ఇస్లామ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ కు 3 వికెట్లు, మెహిదీ హసన్ కు 2, ఖాలెద్ అహ్మద్ 1 వికెట్ తీశారు. టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు కేఎల్ రాహుల్ 22, శుభ్ మాన్ గిల్ 20 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 14 పరుగులు చేశాడు. ఇక అశ్విన్ తో కలిసి అయ్యర్ ఎన్ని పరుగులు చేస్తాడనేదే భారత భారీ స్కోరు అవకాశాలపై ఆధారపడి ఉంది.


Next Story
Share it