గబ్బా చేజారిపోయేలా ఉందే?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో 2వ రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని కనబరిచింది.

By Kalasani Durgapraveen  Published on  15 Dec 2024 10:30 AM GMT
గబ్బా చేజారిపోయేలా ఉందే?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్టు మ్యాచ్‌లో 2వ రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని కనబరిచింది. మొదటి రోజు పెద్దగా ఆట సాగకపోగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 38/0 నుంచి ఆదివారం ఆస్ట్రేలియా బ్యాటింగ్ కొనసాగించింది. ఫామ్ లో లేని స్టీవ్ స్మిత్, అద్భుతమైన ఫామ్ లో ఉన్న ట్రావిస్ హెడ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో బుమ్రా తప్ప మరెవరూ ప్రభావం చూపించలేదు.

ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజ 21, మెక్‌స్వినీ 9, మార్నస్ లబుషేన్ 12, స్టీవెన్ స్మిత్ 101, ట్రావిస్ హెడ్ 152, మిచెల్ మార్ష్ 5, అలెక్స్ క్యారీ 45 (నాటౌట్), ప్యాట్ కమ్మిన్స్ 20, మిచెల్ స్టార్క్ 7 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు. జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్, స్మిత్, ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజ, మెక్‌స్వినీ, మిచెల్ మార్ష్‌లను ఔట్ చేశాడు. మహ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీశారు.

Next Story