క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసియా కప్ భారత్ లోనే.!

2025లో పురుషుల ఆసియా కప్‌ భారత్ లో నిర్వహించనున్నారు. టీ20 ఫార్మాట్‌లో జరుగనున్న ఈ ఈవెంట్ కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

By Medi Samrat  Published on  29 July 2024 3:15 PM GMT
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆసియా కప్ భారత్ లోనే.!

2025లో పురుషుల ఆసియా కప్‌ భారత్ లో నిర్వహించనున్నారు. టీ20 ఫార్మాట్‌లో జరుగనున్న ఈ ఈవెంట్ కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. కానీ 2027లో బంగ్లాదేశ్‌లో నిర్వహించనున్న ఆసియా కప్‌ 50 ఓవర్ల ఫార్మాట్‌ జరుగనుంది. 2023లో ఆసియా కప్‌ను హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించారు.. పాక్‌కు ఆతిథ్య హక్కులు లభించాయి టీమిండియా మ్యాచులన్నీ శ్రీలంక వేదికగా జరిగాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో, కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఇక ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ జారీ చేసిన స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం నిర్వహించిన బిడ్డింగ్‌లో భారత్‌ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. మొత్తం 13 మ్యాచులు జరుగనుండగా భారత్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు మరో జట్టును క్వాలిఫైయింగ్‌ ఈవెంట్‌ ద్వారా ఎంపిక చేయనున్నారు. మహిళల ఆసియా కప్ (15 మ్యాచ్‌లు) తదుపరి ఎడిషన్ కూడా T20 ఫార్మాట్‌లో ఆడనున్నారు. 2026లో టోర్నమెంట్ ను షెడ్యూల్ చేశారు. 2024 మహిళల ఆసియా కప్ ఆదివారం దంబుల్లాలో ముగిసింది, శ్రీలంక తొలి టైటిల్‌ను గెలుచుకుంది.

Next Story