Perth Test : మంచి లీడ్ దక్కించుకున్న భారత్.. సెకండ్ ఇన్నింగ్స్ లో మ్యాజిక్ చేస్తారా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భారత జట్టు మొదటి టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేసింది.

By Medi Samrat  Published on  23 Nov 2024 10:07 AM IST
Perth Test : మంచి లీడ్ దక్కించుకున్న భారత్.. సెకండ్ ఇన్నింగ్స్ లో మ్యాజిక్ చేస్తారా?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భారత జట్టు మొదటి టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేసింది. 51.2 ఓవర్లలో 104 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అవ్వడంతో భారత్ కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీయగా, హర్షిత్ రానా 3 వికెట్లు తీశాడు. సిరాజ్ కు రెండు వికెట్లు దక్కాయి. ఆసీస్ బ్యాటర్లలో ఇద్దరు మాత్రమే 20 పరుగులకు పైగా చేశారు. భారత బ్యాటర్లు మొదటి ఇన్నింగ్స్ లో గొప్పగా బ్యాటింగ్ చేయలేకపోయినా, సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా రాణిస్తారని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్(37) , నితీష్ కుమార్ రెడ్డి(41) మినహాయిస్తే మిగిలిన వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. జైశ్వాల్ (0), పడికల్ (0), కోహ్లీ (5) విఫలమయ్యారు.

Next Story