ఇషాన్ కిషన్ ఊచకోత..కొలంబోలో పాక్ ముందు 176 పరుగుల టార్గెట్

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ తడబడి నిలబడింది

By -  Knakam Karthik
Published on : 15 Feb 2026 8:52 PM IST

Sports News, IndVsPak, T20WorldCup2026, CricketNews

ఇషాన్ కిషన్ ఊచకోత..కొలంబోలో పాక్ ముందు 176 పరుగుల టార్గెట్

కొలంబో: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ తడబడి నిలబడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపు దాడితో పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆరంభంలోనే అభిషేక్ శర్మ (0) వికెట్ కోల్పోయినప్పటికీ, ఇషాన్ కిషన్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు.

కేవలం 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన ఇషాన్, మొత్తం 40 బంతుల్లో 77 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు భారీ స్కోరు పునాది వేశాడు. తిలక్ వర్మ (12), హార్దిక్ పాండ్యా (0) వరుసగా అవుట్ అవ్వడంతో భారత్ కాస్త ఇబ్బంది పడింది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), శివం దూబే (27) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

పాక్ స్పిన్నర్ల మాయాజాలం

కొలంబో పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో పాక్ స్పిన్నర్లు సత్తా చాటారు. ముఖ్యంగా ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్ భారత బ్యాటర్లను కట్టడి చేశారు. షాహీన్ అఫ్రిది ఆఖరి ఓవర్లో వికెట్లు తీసి స్కోరును నియంత్రించే ప్రయత్నం చేశాడు. మరికాసేపట్లో పాకిస్థాన్ 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది. భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఈ స్కోరును డిఫెండ్ చేసి భారత్‌ను గెలిపిస్తారో లేదో చూడాలి!

Next Story