ఇండోర్ మ్యాచ్ ఓటమి.. ఇలా భారత్ కు షాకిచ్చింది

India need to win last game to qualify for WTC final. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు వెళ్లడం భారత్ కు కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంది.

By Medi Samrat  Published on  3 March 2023 4:45 PM IST
ఇండోర్ మ్యాచ్ ఓటమి.. ఇలా భారత్ కు షాకిచ్చింది

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు వెళ్లడం భారత్ కు కొంచెం కష్టమయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు గెలిచిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను బాగా మెరుగుపరచుకుంది. కానీ మూడో టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూసుకెళ్లింది. భారత్ నేరుగా ఫైనల్ కు చేరాలంటే అహ్మదాబాద్ వేదికగా జరిగే నాలుగో టెస్టులో తప్పక నెగ్గాలి. అప్పుడు న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సిన పని ఉండదు.

ఒకవేళ నాలుగో టెస్టులో భారత్ ఓడినా, లేక డ్రా చేసుకున్నా శ్రీలంక, కివీస్ టెస్టు సిరీస్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఆ సిరీస్ లో శ్రీలంకపై న్యూజిలాండ్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ కివీస్ పై శ్రీలంక నెగ్గితే శ్రీలంక జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకుంటుంది. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ డ్రాగా ముగిసినా, సిరీస్ ను కివీస్ గెలిచినా.. ఇక భారత్, ఆసీస్ జట్లు ఫైనల్లో ఆడతాయి. దీంతో నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.


Next Story