ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?

టీమ్‌ ఇండియా ఐసీసీ ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో కప్పు కొట్టిన భారత్‌కు...

By -  అంజి
Published on : 3 Nov 2025 7:25 AM IST

India, Womens World Cup, prize money, ICC, BCCI

ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?

టీమ్‌ ఇండియా ఐసీసీ ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో కప్పు కొట్టిన భారత్‌కు రూ.39.55 కోట్లు ప్రైజ్‌ మనీగా దక్కుతుంది. రన్నరప్‌ సౌతాఫ్రికా జట్టు రూ.19.77 కోట్ల అందుకుంటుంది. ఈ వరల్డ్‌ కప్‌లో ప్రైజ్ మనీ+బోనస్‌లు + పార్టిసిపేషన్‌ ఫీ+బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సకారియా ప్రకటించిన రూ.51 కోట్లతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ.93.66 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. భారత మహిళ జట్టు ఐసీసీ వన్డే కప్‌ నెగ్గడంతో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు సంబరాలు అంబరాన్నంటాయి. ఇన్నేళ్ల తర్వాత ఉమెన్స్‌ క్రికెట్‌లోనూ ప్రపంచ కప్పు కల నెరవేరిందని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టపాసులు కాల్చి, డాన్సులు వేశారు. స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. కంగ్రాట్స్‌ ఉమెన్స్‌ ఇన్‌ బ్లూ అంటూ కామెంట్లతో సోషల్‌ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి భారత్ తమ తొలి మహిళల ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. షఫాలి వర్మ మరియు దీప్తి శర్మ తమ ఆటతో హోరెత్తించారు. ఐసిసి టైటిల్ కోసం జరిగిన పోరులో భారత్ తమ నిరీక్షణకు ముగింపు పలికింది.

Next Story