ఆసియా కప్ టోర్నీకి ముందు టీమ్ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడ్డాడు. ఆసియా కప్ కోసం యూఏఈ బయలుదేరే ముందు కరోనా పరీక్షలు నిర్వహించగా రాహుల్ ద్రవిడ్‌కు పాజిటివ్ అని వచ్చింది. దీంతో అతడు యూఏఈకి వెళ్లలేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పంత్ వంటి ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. ఈ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఆగస్టు 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. మరీ ఆసమయం కల్లా రాహుల్ కోలుకుంటాడో లేదో చూడాల్సిందే.
ఒకవేళ రాహుల్ ద్రవిడ్ కోలుకోకుంటే అతడి స్థానంలో కోచ్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్(ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. జింబాబ్వే సిరీస్‌కు ద్రవిడ్‌కు బీసీసీఐ విశ్రాంతి కల్పించడంతో ఈ టూర్‌కు హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో ఆడిన కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, దీపక్ హుడాలు యూఏఈలో భారత జట్టుతో కొంచెం ఆలస్యంగా కలవనున్నారు.
ఇప్పటికే భారత బౌలర్లు బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల కారణంగా ఆసియా కప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోచ్ ద్రవిడ్ కూడా దూరం అయితే అది భారత్‌కు ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. వ్యూహ రచనలో, డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రశాంతమైన, ఆరోగ్య కరమైన వాతావరణం ఉంచడంతో ద్రవిడ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.