తండ్రి అయిన టీమిండియా క్రికెటర్..!

India Fast Bowler Umesh Yadav Blessed With A Baby Girl. కొత్త సంవత్సరం రోజు అందరూ ఎంతో సంతోషంగా గడుపుతారు. క్రికెటర్ఉమేష్ యాదవ్ భార్య తాన్య వాద్వా ఓ పండంటి ఆడబిడ్డకు నూతన సంవత్సరం రోజున జన్మనిచ్చారు

By Medi Samrat  Published on  2 Jan 2021 7:32 AM GMT
Bowler Umesh Yadav

కొత్త సంవత్సరం రోజు అందరూ ఎంతో సంతోషంగా గడుపుతారు. కానీ కొత్త సంవత్సరం ప్రముఖ టీమిండియా క్రికెట్ ఉమేష్ యాదవ్ కు రెండింతల ఆనందాన్ని తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. ఉమేష్ యాదవ్ భార్య తాన్య వాద్వా ఓ పండంటి ఆడబిడ్డకు నూతన సంవత్సరం రోజున జన్మనిచ్చారు. వీరి ఇంట చిన్న రాజకుమారి పుట్టడంతో వీరికి నిజంగానే హ్యాపీ న్యూ ఇయర్ అయింది అని చెప్పవచ్చు. తాను తండ్రి అయిన ఆనందాన్ని ఉమేష్ యాదవ్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని తెలియజేశారు.ఉమేష్ యాదవ్ సోషల్ మీడియా వేదిక ద్వారా పాప పుట్టింది అంటూ.. ఓ అందమైన పాప ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఆ ఫోటోలో "వెల్ కమ్ టు ద వరల్డ్ లిటిల్ ప్రిన్సెస్. చాలా థ్రిల్లింగ్గా ఉంది". అంటూ ఆ ఫోటో పై రాసి ఉంది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముప్పైమూడేళ్ళ ఉమేష్ యాదవ్ 2013సంవత్సరంలో తాన్య వాద్వా వివాహం జరిగింది. ప్రస్తుతం ఉమేష్ యాదవ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న

బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌ బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు జరిగిన ఆటలో ఉమేష్ గాయపడిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఆ గాయం నుంచి ఉమేష్ యాదవ్ కోలుకోక పోవటం వల్ల అతని స్థానంలో నటరాజన్‌ అనే మరో బౌలర్ ను తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్రస్తుతం ఉమేష్ యాదవ్, షమీలను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తీసుకు వెళ్లనున్నారు.ప్రస్తుతం స్వదేశానికి తిరిగి వస్తున్న ఉమేష్ యాదవ్ కు తన కూతురుతో ఆడుకునే టైం దొరికింది అని చెప్పవచ్చు. కొత్త సంవత్సరంలో శుభవార్త చెప్పిన ఉమేష్ యాదవ్ కు తోటి క్రీడాకారులు, తన అభిమానులు పెద్ద ఎత్తున అతనికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్ లలో ఉమేష్ యాదవ్ ఒకటి ఆడిలైడ్, మరొకటి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో రెండు టెస్టులు ఆడిన సంగతి మనకు తెలిసిందే.


Next Story
Share it