ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఇంగ్లండ్‌తో భారత్ వేదికగానే టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతోంది.

By Srikanth Gundamalla  Published on  29 Feb 2024 9:53 AM GMT
india, england,  test match, cricket, bumrah,

ఇంగ్లండ్‌తో చివరి టెస్టుకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

ఇంగ్లండ్‌తో భారత్ వేదికగానే టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతోంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో ఇప్పటికే ఇండియా కైవసం చేసుకుంది. కాగా.. చివరి టెస్టు మ్యాచ్‌ నామమాత్రంగానే జరగనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. అప్‌డేట్‌ చేసిన జట్టును వెల్లడించారు. నాలుగో టెస్టుకు దూరంగా ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా చివరి టెస్టులో రీఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా జట్టులోకి రావడంతో తుది జట్టులో అతడి స్థానం ఖరారు అయినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.

ఐదో టెస్ట్‌ కోసం అప్‌డేట్‌ చేసిన భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్‌), కేఎస్ భరత్ (వికెట్‌కీపర్‌), దేవదత్ పడిక్కల్, అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్

ఇక నాలుగో టెస్టు మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై వేటు పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దాంతో.. ఆకాశ్‌దీప్‌ తో కలిసి బుమ్రా భారత పేస్‌ బౌలింగ్‌ దళాన్ని లీడ్‌ చేయనున్నాడు. అయితే.. ధర్మశాల స్టేడియంలోని పిచ్‌ స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. దాంతో.. పేసర్ల కంటే స్పిన్నర్లకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సిరాజ్‌ అప్‌డేట్‌ చేసిన జట్టులో ఉన్నా.. అతన్ని పక్కకు పెట్టే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. వరుసగా మూడు టెస్టుల్లో రజత్‌ పాటిదార్ విఫలం అయ్యాడు. దాంతో.. అతడి స్థానంలో పడిక్కల్‌ రావొచ్చు. ఐదో టెస్టులో రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చి.. అశ్విన్‌కు తాత్కాలిక కెప్టెన్సీ బాద్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. .

మరోవైపు అశ్విన్‌కు ధర్మశాల వేదికగా జరగనున్న ఐదో టెస్టు ప్రత్యేకమైనది. అశ్విన్‌కు ఇది 100వ టెస్టు మ్యాచ్‌. అయితే.. అశ్విన్‌కు కెప్టెన్సీ ఇస్తారనుకున్నా.. అది నిజం కాదని తేలింది. రోహిత్‌ అప్‌డేట్ చేసిన జట్టులో ఉన్నాడు. దాంతో.. అతను తుది జట్టులో కూడా ఉంటాడని కన్ఫమ్ అయినట్లే. అంటే రోహితే కెప్టెన్‌గా ఉంటాడు.

Next Story