2026 టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే..!
2025 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు పలు విజయాలు సాధించింది. భారత పురుషుల జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ ట్రోఫీలను కైవసం చేసుకుంది.
By - Medi Samrat |
2025 సంవత్సరంలో భారత క్రికెట్ జట్టు పలు విజయాలు సాధించింది. భారత పురుషుల జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ ట్రోఫీలను కైవసం చేసుకుంది. మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. దీంతో కొత్త సంవత్సరంలో జరుగనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌పైనే అందరి దృష్టి పడింది. ఇది మాత్రమే కాదు.. వచ్చే ఏడాది భారత పురుషుల జట్టు అండర్-19 ప్రపంచకప్, ఆసియా క్రీడలు, మహిళల టీ20 ప్రపంచకప్‌లను ఆడనుంది. ఈలోగా వచ్చే ఏడాది భారత పురుషుల జట్టు షెడ్యూల్‌ను చూద్దాం.
వచ్చే ఏడాది ఆరంభంలో భారత పురుషుల జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. జనవరి 11 నుంచి వన్డే సిరీస్, జనవరి 21 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా.. వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జోడీ ఏడాది ఆరంభంలోనే కనిపించనుంది.
వన్డే సిరీస్ షెడ్యూల్
మొదటి వన్డే: జనవరి 11, వడోదర
రెండో వన్డే: జనవరి 14, రాజ్‌కోట్
మూడో వన్డే: జనవరి 18, ఇండోర్
టీ20 సిరీస్ షెడ్యూల్
మొదటి టీ20: 21 జనవరి, నాగ్‌పూర్
రెండో టీ20: 23 జనవరి, రాయ్‌పూర్
మూడవ టీ20: జనవరి 25, గౌహతి
నాలుగో టీ20: జనవరి 28, విశాఖపట్నం
ఐదవ టీ20: 31 జనవరి, తిరువనంతపురం
టీ20 ప్రపంచ కప్ 2026
T20 ప్రపంచ కప్ 2026 ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు జరుగుతుంది. టైటిల్ కోసం 20 జట్లు పోటీపడతాయి. టైటిల్‌ను కాపాడుకోవాలని భారత జట్టు కన్నేసింది. ఈ టోర్నీకి భారత జట్టును కూడా ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆడనున్న జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు.
2026లో భారత పురుషుల జట్టు షెడ్యూల్
జూన్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్‌ల మధ్య 1 టెస్టు, 3 వన్డేల సిరీస్ భారత్‌లో జరగనుంది.
జూలై 1 నుంచి 19 వరకు ఇంగ్లండ్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టీ20, 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఆగస్టులో భారత్-శ్రీలంక మధ్య 2 టెస్టుల సిరీస్ జరగనుంది. ఇది శ్రీలంకలో నిర్వహించబడుతుంది.
సెప్టెంబర్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 3 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
సెప్టెంబర్-అక్టోబర్‌లో భారత గడ్డపై భారత్-వెస్టిండీస్ మధ్య 3 వన్డేలు, 5 టీ20లు జరగనున్నాయి.
ఆసియా క్రీడలు 2026 (T20) జపాన్‌లో సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనుంది.
అక్టోబర్-నవంబర్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఏడాది చివర్లో శ్రీలంక జట్టు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌ల కోసం భారత్‌కు రానుంది.
2026లో భారత మహిళల జట్టు షెడ్యూల్
ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9 వరకు ఆస్ట్రేలియాతో 1 టెస్టు, 3 టీ20, 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.
మే 28 నుంచి జూన్ 2 మధ్య ఇంగ్లండ్‌తో 3 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026 జూన్ 12 నుంచి జూలై 5 వరకు జరగనుంది.
జూలై 10న ఇంగ్లండ్‌తో ఏకైక వన్డే మ్యాచ్ జరగనుంది.
ఆసియా క్రీడలు 2026 సెప్టెంబర్ 19, అక్టోబర్ 4 మధ్య జపాన్‌లో జరగనున్నాయి.