అంతక ముందు ఓవర్ నైట్ స్కోర్ 258/4 తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా మరో 87 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు ఒక్క పరుగుకు కూడా జోడించకుండానే జడేజా(50) పెవిలియన్ చేరాడు. దీంతో ఐదో వికెట్‌కు శ్రేయాస్-జడేజా జోడించిన 121 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటి జేమీసన్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి శ్రేయాస్ టెస్టుల్లో తొలి శతకాన్ని అందుకున్నాడు.
ఆదుకుంటాడు అనుకున్న వృద్దిమాన్ సాహా(1) విఫలం కాగా.. శతకం చేసిన కాసేపటికే అయ్యర్ కూడా ఔట్ అయ్యాడు. చివర్లో అశ్విన్(38; 56 బంతుల్లో 5పోర్లు) ధాటికి ఆడాడు. లంచ్ విరామం అనంతరం అజాజ్ పటేల్ అశ్విన్, ఇషాంత్(0)లను ఔట్ చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కివీస్ బౌలర్లలో టిమ్‌సౌథి 5 వికెట్లు పడగొట్టగా.. జేమిసన్ 3, అజాజ్ పటేల్ 2 వికెట్లను తీశారు.