కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతి నివ్వగా గాయంతో కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌కు దూరం అయ్యారు. దీంతో పలువరు యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఇక కివీస్ తరుపున రచిన్ రవీంద్ర టెస్టులో అరంగ్రేటం చేస్తున్నాడు. కాగా.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది.