కాసేపట్లో ఆసియా కప్‌కు భారత జట్టును ప్రకటించనున్న సెలక్షన్ కమిటీ.. ఇంత పోటీనా.?
ఆసియా కప్ 2025 UAE గడ్డపై సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది.
By Medi Samrat
ఆసియా కప్ 2025 UAE గడ్డపై సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. ఈ టోర్నమెంట్ మొత్తం 8 జట్ల మధ్య జరుగుతుంది. ఈ టోర్నీ ఆసియా క్రికెట్‌లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే అవకాశం మాత్రమే కాకుండా.. 2026 T20 ప్రపంచ కప్‌కు సన్నాహాలకు కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
ఈసారి ఆసియా కప్ T20 ఫార్మాట్‌లో (ఆసియా కప్ 2025 T20 ఫార్మాట్) జరుగుతుంది. టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ జరగడం ఇది మూడోసారి. 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. అందులో రెండు గ్రూపుల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్‌కి వెళ్తాయి. సూపర్-4లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌లో తలపడతాయి. ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. కానీ నేటితో నిరీక్షణకు తెరపడనుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ముంబైలో సెలక్షన్ కమిటీ సమావేశం ఉంటుందని, ఆ తర్వాత 1:30 గంటలకు జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకుని పిట్‌నెస్ నిరూపించుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాడు.
2025 ఆసియా కప్‌లో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గత ఎడిషన్ అంటే 2023లో భారత్ ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించి టీమ్ ఇండియా ఈ టైటిల్‌ను గెలుచుకుంది.
ఆసియా కప్ 2025 సెప్టెంబరు 9 నుండి UAEలో ప్రారంభం కానుంది. దీని కోసం భారత జట్టును ఈరోజు ప్రకటించనున్నారు. ఈసారి జట్టులో చాలా పెద్ద మార్పులు కనిపించనున్నాయి. T20I నుండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడే మొదటి ప్రధాన టోర్నమెంట్ కావడంతో జట్టు కూర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
శస్త్రచికిత్స తర్వాత ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినందున సూర్యకుమార్ యాదవ్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. సంజూ శాంసన్, అభిషేక్ శర్మల ప్లేస్ ఫిక్స్ అయినట్లే. శుభ్‌మన్ గిల్ పేరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. యశస్వి జైస్వాల్‌కి అవకాశం రావచ్చని, గిల్‌ను తప్పించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అలాగే.. భారత జట్టులోకి అదనపు బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేయాలని కమిటీ నిర్ణయించినట్లయితే.. రింకూ సింగ్ కంటే శ్రేయాస్ అయ్యర్‌కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. స్పిన్నర్లపై అయ్యర్ బాగా ఆడతాడు. అలాగే, అతను రెండు వేర్వేరు ఐపిఎల్ జట్లను ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. అతనికి నాయకత్వ సామర్థ్యాలు కూడా ఉన్నాయి. అయితే, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఎక్కువగా ఆల్ రౌండర్లను జట్టులో చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. సుందర్ ఇటీవలే ఇంగ్లాండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అయ్యర్ లేదా సుందర్ ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.
జట్టు ఎంపిక కోసం పరిగణలోకి తీసుకునే ఆటగాళ్లు వీరే..
బ్యాట్స్‌మెన్- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్.
వికెట్ కీపర్లు- సంజు శాంసన్, జితేష్ శర్మ, ధృవ్ జురెల్
ఆల్ రౌండర్లు- హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రియాన్ పరాగ్
స్పిన్నర్లు- కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్
పేసర్లు- జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ