చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఎంపిక
India announce squad final 2 tests England.అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి టెస్టుల్లో పాల్గొనే భారత జట్టు ఎంపిక
By తోట వంశీ కుమార్ Published on 17 Feb 2021 5:51 PM IST
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి టెస్టుల్లో పాల్గొనే జట్టును బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) ప్రకటించింది. మొత్తం 17 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ మినహా.. తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన ఆటగాళ్లందరూ చివరి రెండు టెస్టులకు ఎంపికయ్యారు. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనేందుకు శార్దూల్ ను జట్టు నుంచి విడుదల చేశారు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో పేసర్ ఉమేశ్ యాదవ్ జట్టులోకి వస్తాడని.. అయితే.. ఉమేశ్ కి మెడికల్ టీమ్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. స్టాండ్‌బై ఉండి తొలి టెస్టులో చోటు సంపాదించుకున్న స్పిన్నర్ నదీమ్‌ను ఎంపిక చేయలేదు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉండగా.. ఫిబ్రవరి 24 నుంచి అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఇది డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్
చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, శుభ్ మన్ గిల్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇశాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్.
స్టాండ్ బై ప్లేయర్లు అభిమన్యు ఈశ్వరన్, షహబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచాల్ లను కూడా విజయ్ హజారే ట్రోఫీ కోసం విడుదల చేశారు. చివరి టెస్టులకు నెట్ బౌలర్లుగా అంకిత్ రాజ్ పుత్, అవీశ్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరవ్ కుమార్ లను ఎంపిక చేశారు. స్టాండ్ బై ప్లేయర్లుగా కేఎస్ భరత్, రాహుల్ చాహర్ లను తీసుకున్నారు.