అక్ష‌ర్ ప‌టేల్ సెంచ‌రీ మిస్‌.. భార‌త్ 400 ఆలౌట్‌

India All Out For 400 As Axar Patel Falls For 84. ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Feb 2023 11:50 AM IST
అక్ష‌ర్ ప‌టేల్ సెంచ‌రీ మిస్‌.. భార‌త్ 400 ఆలౌట్‌

బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోపీలో భాగంగా నాగ‌పూర్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో భార‌త బ్యాట‌ర్లు స‌త్తా చాటారు. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 400 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. దీంతో 223 ప‌రుగుల కీల‌క ఆధిక్యాన్ని భార‌త్ సాధించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ (120) సెంచ‌రీ చేయ‌గా ఆల్‌రౌండ‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్‌(84), ర‌వీంద్ర జ‌డేజా(70) అర్థ‌శ‌త‌కాల‌తో ఆక‌ట్టుకున్నారు. ఆఖ‌ర్లో ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ 2 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాది వేగంగా 37 ప‌రుగులు చేశాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో అరంగ్రేట స్పిన్న‌ర్ మ‌ర్ఫీ 7 వికెట్ల‌తో రాణించాడు. పాట్ క‌మిన్స్ రెండు, నాథ‌న్ ల‌య‌న్ ఓ వికెట్ తీశారు.

ఓవ‌ర్ నైట్ 321/7తో మూడో రోజు ఆట‌ను కొన‌సాగించిన‌ భార‌త్ మ‌రో 79 ప‌రుగులు చేసి ఆలౌటైంది. ఆట ఆరంభ‌మైన కాసేప‌టికే జ‌డేజా పెవిలియ‌న్‌కు చేరారు. అయితే.. అక్ష‌ర్‌, ష‌మీ దూకుడుగా ఆడ‌డంతో భార‌త్ 400 ప‌రుగులు దాటింది. 200 పైగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై ప‌ట్టు సాధించింది భార‌త్. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తున్న నేప‌థ్యంలో అశ్విన్‌, జ‌డేజా, అక్ష‌ర్‌లు మాయ చేస్తే భార‌త్ మ‌రోసారి బ్యాటింగ్ చేయ‌కుండానే ఇన్నింగ్స్ తేడాతో విజ‌యం సాధించే అవ‌కాశం ఉంది. ఒక వేళ ఆసీస్ బ్యాట‌ర్లు ప‌ట్టుద‌ల‌తో ఆడితే మాత్రం మ్యాచ్ ఉత్కంఠ‌గా మారే అవ‌కాశం ఉంది.

Next Story