IND vs NZ 1st T20 : ఇరు జ‌ట్ల‌కు క‌లిసొచ్చిన గ్రౌండ్‌.. పిచ్ రిపోర్టు ఇదే..!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.

By -  Medi Samrat
Published on : 20 Jan 2026 3:18 PM IST

IND vs NZ 1st T20 : ఇరు జ‌ట్ల‌కు క‌లిసొచ్చిన గ్రౌండ్‌.. పిచ్ రిపోర్టు ఇదే..!

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య నాగ్‌పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు 25 సార్లు తలపడగా.. అందులో టీమ్ ఇండియా 12 మ్యాచ్‌లు గెలుపొందగా, న్యూజిలాండ్ జట్టు 10 మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో 3 మ్యాచ్‌లు టైగా మిగిలాయి. రెండు జట్ల మధ్య మొదటి T20 మ్యాచ్ 16 సెప్టెంబర్ 2007న జోహన్నెస్‌బర్గ్‌లో జరిగింది. ఇందులో కివీస్ 10 పరుగుల తేడాతో గెలిచింది. చివరి T20 మ్యాచ్ 1 ఫిబ్రవరి 2023న అహ్మదాబాద్‌లో జరిగింది. ఇందులో టీమ్ ఇండియా 168 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా టీ20లో న్యూజిలాండ్‌పై భారత్‌దే పైచేయి అని గణాంకాలు చెబుతున్నాయి.

అటువంటి పరిస్థితిలో మ్యాచ్‌కి ముందు నాగ్‌పూర్‌లోని VCA స్టేడియంలోని పిచ్ స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విదర్భ క్రికెట్ అసోసియేషన్ (VCA) స్టేడియం భారత్‌, న్యూజిలాండ్ మధ్య మొదటి T20I మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది జనవరి 21న ఈ మ్యాచ్‌ జరుగుతుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ జరగనున్న తొలి ద్వైపాక్షిక టీ20 మ్యాచ్ ఇదే. 2016లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య చివరి టీ20 మ్యాచ్ కూడా ఇక్క‌డే జరిగింది.

నాగ్‌పూర్‌లోని VCA స్టేడియం పిచ్ గురించి మాట్లాడినట్లయితే.. ఇది సాధారణంగా స్పిన్ బౌలర్లకు అనుకూలమైనదిగా పరిగణిస్తారు. పిచ్ ప్రారంభంలో మంచి బౌన్స్ అందిస్తుంది. దీని కారణంగా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం కనిపిస్తుంది. ఆట సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు ఉపయోగపడుతుంది. మిడిల్ ఓవర్లలో మంచి పరుగులు చేసిన జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది, అయితే ఈ పిచ్ టి20లో కూడా నెమ్మదిగా కనిపించింది.

విదర్భ క్రికెట్ అసోసియేషన్‌లో ఇప్పటివరకు మొత్తం 13 T20I మ్యాచ్‌లు జ‌రిగాయి. ఇందులో భారత్‌ ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో 2016లో న్యూజిలాండ్ ఈ మైదానంలో ఒక్క మ్యాచ్ ఆడింది, అందులోనూ గెలిచింది. ఈ మ్యాచ్ 2016 ప్రపంచ కప్ సూపర్-10 గ్రూప్-2 మ్యాచ్. ఇందులో కివీ జట్టు 47 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మిచెల్ సాంట్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

భారత్ vs Nz 1వ T20I : భారత్-న్యూజిలాండ్ జట్లు

భారత్- సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (తొలి మూడు టీ20లు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.

న్యూజిలాండ్- మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, బెవాన్ జాకబ్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి.

Next Story