భారత్ ముందు మంచి లక్ష్యం.. కానీ వర్షం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది.

By అంజి  Published on  18 Dec 2024 10:33 AM IST
IND vs AUS 3rd Test, Australia, India, Gabba Test

భారత్ ముందు మంచి లక్ష్యం.. కానీ వర్షం 

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను 89/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు లభించిన 185 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని టీమిండియా విజయలక్ష్యం 275 పరుగులుగా ఖరారైంది.

ఆస్ట్రేలియా బ్యాటర్లు వేగంగా పరుగులు చేయాలని ఆడే క్రమంలో వరుసగా వికెట్లు కోల్పోయారు. 89 పరుగులకే 7 వికెట్లు పడ్డాయి. జస్ప్రీత్ బుమ్రా 3, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో 2 చొప్పున వికెట్లు తీశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్లలో మెక్‌స్వీనీ 4, ఉస్మాన్ ఖవాజా 8, మార్నస్ లబుషేన్ 1, మిచెల్ మార్ష్ 2, ట్రావిస్ హెడ్ 17, స్టీవెన్ స్మిత్ 4, అలెక్స్ క్యారీ 20, ప్యాట్ కమ్మిన్స్ 22, మిచెల్ స్టార్క్ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. 275 పరుగుల లక్ష్యం భారత్‌ను ఊరిస్తున్నా వర్షం పడుతూ ఉండడంతో మ్యాచ్ డ్రా దిశగా సాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Next Story