వికెట్లు ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లం : శాంస‌న్‌

If We Had Wickets In Hand This Was Chasable says Sanju Samson.గ‌త‌రాత్రి గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2022 2:18 PM IST
వికెట్లు ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లం : శాంస‌న్‌

గ‌త‌రాత్రి గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 37 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (87 నాటౌట్; 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ), అభినవ్‌ మనోహర్‌ ( 43; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్‌ మిల్లర్‌ (31 నాటౌట్‌; 14 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) లు రాణించారు. చేధ‌న‌లో రాజ‌స్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. ఆ జ‌ట్టు బ్యాట‌ర్ జోస్‌ బట్లర్‌ (54; 24 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ) చెల‌రేగినా.. మిగ‌తా వాళ్లు విఫ‌లం కావ‌డంతో రాజ‌స్థాన్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు.

ఇక మ్యాచ్ అనంత‌రం రాజ‌స్థాన్ జ‌ట్టు కెప్టెన్ సంజూ శాంస‌న్ మాట్లాడుతూ.. గుజ‌రాత్ అంత స్కోర్ చేసిందంటే ఆ క్రెడిట్‌ అంతా ఆ జట్టు బ్యాట‌ర్ల‌కు ద‌క్కుతుంది. హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వారి బ్యాటింగ్ ఆసాంతం అద్భుతంగా సాగింది. ఇక మా చేతిలో వికెట్లు ఉంటే ఈ లక్ష్యాన్ని చేధించేవాళ్లమే. ప‌వ‌ర్ ప్లేలో అద్భుత‌మైన ర‌న్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన‌ప్ప‌టికీ త‌రువాత వికెట్లు కోల్పోయాం. లీగ్‌లో ప్ర‌తి మ్యాచ్ ముఖ్య‌మైందే అని తెలుసు. త‌రువాతి మ్యాచ్‌లో తిరిగి బ‌లంగా పుంజుకుంటాం. గత సీజన్ వరకు నేను మూడో స్థానంలో ఆడాను. కానీ ఈ సారి జట్టు అవసరాలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. ఆ క్రమంలో నెంబర్ 4, 5 స్థానాల్లో ఆడటానికైనా సిద్దం. అశ్విన్‌ను కూడా ఈ మ్యాచ్‌లో అలా ఆడించాం. గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం అయిన ట్రెంట్ బౌల్డ్ త‌రువాత మ్యాచ్‌కి అందుబాటులోకి వ‌స్తాడ‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు.

గుజ‌రాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ.. జ‌ట్టు ఎప్పుడూ ఇలా విజ‌యాసాధిస్తుంటే బాగుంటుంద‌ని అన్నాడు. రాజ‌స్థాన్ ఇన్నింగ్స్ 18వ‌ ఓవ‌ర్‌లో బౌలింగ్ చేస్తున్న‌ప్పుడు తొడ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతోనే మైదానం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్లు చెప్పాడు. ఈ రోజు ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు బ్యాటింగ్ చేశాన‌ని, కెప్టెన్‌గా జ‌ట్టును ముందుండి న‌డ‌ప‌డం గొప్ప విశేష‌మ‌ని అన్నాడు.

Next Story