ఇంగ్లాండ్‌దే టాప్.. రెండో స్థానంలో భార‌త్‌

ICC T20 Rankings.

By Medi Samrat  Published on  3 Dec 2020 2:33 AM GMT
ఇంగ్లాండ్‌దే టాప్.. రెండో స్థానంలో భార‌త్‌

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ ర్యాంకింగ్ పట్టికలో తమ రేటింగ్స్ పాయింట్స్ ను 275 కు మెరుగుపరుచుకుని మొదటి స్థానానికి చేరింది. ఆరువాత ఆస్ట్రేలియా (275), భారత్ (266) పాకిస్థాన్ (262), దక్షిణాఫ్రికా (252) వరుసగా మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం టీమ్ఇండియా ఆసీస్‌లో ప‌ర్య‌టిస్తోంది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య మూడు ఈనెల 4 నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. ఇంగ్లాండ్‌, ఆసీస్‌, భార‌త్ మ‌ధ్య పాయింట్లలో చాలా స్వ‌ల్ప తేడా ఉండ‌డంతో..మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు తొలి స్థానానికి చేరుకునే అవ‌కాశం ఉంది.

వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా ఇంగ్లాండ్‌ అగ్ర స్థానంలో ఉంది. 123 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లీష్ జట్టు టాప్‌లో కొనసాగుతోంది. 2019 ప్రపంచకప్‌ నుంచి ఇంగ్లాండ్ మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 116 రేటింగ్ పాయింట్లతో టీమ్ఇండియా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాపై రెండు వన్డేల్లో ఓడినా.. టీమిండియా తమ స్థానాన్ని కాపాడుకుంది. ఆ త‌రువాత న్యూజిలాండ్‌(116), ఆస్ట్రేలియా (113), దక్షిణాఫ్రికా (108) లు వ‌రుస‌గా టాప్-5లో ఉన్నాయి.
Next Story
Share it