ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాలిటిక్స్ వద్దు..ఆటగాళ్లకు ఐసీసీ వార్నింగ్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత్ – పాక్ మ్యాచ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.

By -  Knakam Karthik
Published on : 21 Sept 2025 8:20 PM IST

Sports News, Asia Cup 2025, ICC, India-Pakistan match

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత్ – పాక్ మ్యాచ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగే పోరులో ఆటగాళ్లు లేదా జట్ల అధికారులు ఏ విధమైన రాజకీయ వ్యాఖ్యలు గానీ, క్రికెట్‌కు సంబంధం లేని విషయాలు గానీ ప్రస్తావించరాదని ఐసీసీ స్పష్టంగా తెలిపింది.

మ్యాచ్ అనంతరం జరగబోయే ప్రెజెంటేషన్ షో, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో రాజకీయాలు, వివాదాస్పద అంశాలు ప్రస్తావిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. నియమాలు ఉల్లంఘించిన పక్షంలో ఒక సంవత్సరానికి నిషేధం విధించే అవకాశం కూడా ఉందని బోర్డు హెచ్చరించింది. క్రికెట్‌ను శాంతియుతంగా, ఆట స్పూర్తితో ఆడుకోవాలే గానీ, అనవసరమైన వాగ్వాదాలు లేదా రాజకీయ రంగు పులమడం అంగీకరించబోమని ఐసీసీ స్పష్టం చేసింది.

“మ్యాచ్ అంటే ఆట మాత్రమే. unnecessary noise, drama వద్దు. ఆటగాళ్లు ప్రశాంతంగా ఆడాలి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా వివాదం రేపితే నష్టపోవాల్సిందే” అని ఐసీసీ స్పష్టం చేసింది. భారత క్రికెట్ అభిమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ – “మ్యాచ్ అనేది కేవలం క్రీడ మాత్రమే. unnecessary politics వద్దు” అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు

Next Story