ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ ఐసీసీ

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేసింది.

By Medi Samrat  Published on  16 Nov 2024 4:15 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ ఐసీసీ

వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేసింది. ఐసీసీ గ్లోబ‌ల్‌ ట్రోఫీ టూర్‌ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో నిర్వహించడంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఐసీసీ సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ట్రోఫీ టూర్ ఇప్పుడు కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంక్వా ప్రాంతం మీదుగా సాగుతుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నుండి ప్రారంభమవుతుంది. నవంబర్ 17న తక్షిలా, ఖాన్‌పూర్, నవంబర్ 18న అబోటాబాద్, నవంబర్ 19న ముర్రే, నవంబర్ 20న నథియా గలీ, నవంబర్ 22 నుండి 25న కరాచీలో ముగుస్తుంది.

అంతకుముందు నవంబర్ 14 న పీసీబీ ట్రోఫీ టూర్‌ను ప్రకటించింది. ఇందులో భారత్‌, పాకిస్తాన్ మధ్య వివాదాస్పద భూభాగమైన పీఓకే ప్రాంతంలోని స్కర్డు, హుంజా, ముజఫరాబాద్ వంటి నగరాలు ఉన్నాయి. పీఓకే ప్రాంతంలో పీసీబీ ట్రోఫీ టూర్ ప్లాన్‌లపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) సెక్రటరీ జయ్ షా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్ర‌మంలోనే శనివారం టూర్ షెడ్యూల్‌లో ఐసీసీ మార్పులు చేసింది.

పాకిస్థాన్‌లో తర్వాత.. ఆఫ్ఘనిస్తాన్ (నవంబర్ 26-28), ఆ తర్వాత బంగ్లాదేశ్ (డిసెంబర్ 10-13), దక్షిణాఫ్రికా (డిసెంబర్ 15-22), ఆస్ట్రేలియా (డిసెంబర్ 25-జనవరి 5), న్యూజిలాండ్ (జనవరి 6-11), ఇంగ్లండ్ (జనవరి 12-14), భారత్‌లో (జనవరి 15-26) ట్రోఫీ గ్లోబ‌ల్ టూర్ ఉంటుంది.

Next Story