స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడాలనుకుంటున్నారా..? ఒకే క్లిక్‌తో టిక్కెట్ కొనండి ఇలా..

భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ జరుగుతోంది. ఇందులో టీం ఇండియా మొదటి T20 మ్యాచ్‌ను గెలుచుకుంది

By Medi Samrat  Published on  7 Oct 2024 3:46 PM GMT
స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూడాలనుకుంటున్నారా..? ఒకే క్లిక్‌తో టిక్కెట్ కొనండి ఇలా..

భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల T20 సిరీస్ జరుగుతోంది. ఇందులో టీం ఇండియా మొదటి T20 మ్యాచ్‌ను గెలుచుకుంది. గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 9న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రెండో టీ20లో విజయం సాధించడం ద్వారా భారత జట్టు సిరీస్‌ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది.

అదే సమయంలో చివరి టీ20 మ్యాచ్ అక్టోబర్ 12న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. అటువంటి పరిస్థితిలో భారత్-బంగ్లాదేశ్‌ల మూడవ T20I కోసం అభిమానులు ఎలా, ఎక్కడ నుండి టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చో చూద్దాం.

Paytm ఇన్‌సైడర్ యాప్, వెబ్‌సైట్ ద్వారా మూడవ T20I మ్యాచ్ టిక్కెట్ల ఆన్‌లైన్ విక్రయం ప్రారంభమైంది. అభిమానులు ఈరోజు అంటే అక్టోబర్ 7 నుండి టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ టిక్కెట్ ధర రూ.750 (నార్త్ పెవిలియన్ టెర్రేస్-1 మరియు 2), అలాగే రూ.1000 టికెట్, రూ.1250 టిక్కెట్, రూ.1750 నుంచి రూ.8000 టిక్కెట్లు వ‌ర‌కూ ఉన్నాయి.

అభిమానులు Paytm ఇన్‌సైడర్ యాప్ ద్వారా అక్టోబర్ 9న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్న రెండో T20 మ్యాచ్‌కి కూడా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. రెండు రోజుల తర్వాత ఢిల్లీలో మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం టిక్కెట్ ధర రూ.2000 నుంచి రూ.18000 వరకు ఉంది. వేర్వేరు స్టాండ్ల ధర భిన్నంగా ఉంటుంది.

Next Story