సెమీస్‌లో అడుగు పెట్టిన భారత్

పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ ఈవెంట్‌లో భారతజట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. 40 నిమిషాలకు పైగా భారత్ 10 మందితోనే ఆడినా.. బ్రిటన్ ను 1-1తో అడ్డుకుంది.

By అంజి  Published on  4 Aug 2024 4:57 PM IST
Hockey, India, Great Britain, Olympics

  సెమీస్‌లో అడుగు పెట్టిన భారత్  

పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ ఈవెంట్‌లో భారతజట్టు సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. 40 నిమిషాలకు పైగా భారత్ 10 మందితోనే ఆడినా.. బ్రిటన్ ను 1-1తో అడ్డుకుంది. ఇక పెనాల్టీ షూటౌట్‌లో గ్రేట్ బ్రిటన్‌ను 4-2తో భారత్ ఓడించింది. ఈ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ ఆటగాడికి వ్యతిరేకంగా స్టిక్ తగిలించినందుకు అమిత్ రోహిదాస్‌కు రెడ్ కార్డ్ చూపడంతో భారత జట్టు 10 మందితోనే ఆడాల్సి వచ్చింది.

వెటరన్ గోల్ కీపర్ PR శ్రీజేష్.. తన చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో బ్రిటన్ దాడులకు వ్యతిరేకంగా అడ్డుగా నిలిచాడు. 22వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ ను గోల్ గా మరచి హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్ కు ఆధిక్యాన్ని అందించాడు. 27వ నిమిషంలో లీ మోర్టన్ గోల్ చేసి బ్రిటన్ ఖాతా తెరిచాడు.

భారత డిఫెండర్ రోహిదాస్ కు వివాదాస్పద రీతిలో రెడ్ కార్డ్ ఇవ్వడంతో భారత్ 10 మందికి పరిమితమైంది. ఆ తర్వాత, గ్రేట్ బ్రిటన్ వరుసగా దాడులు జరిపింది.. అయితే భారత డిఫెన్స్ అద్భుతంగా ఉండడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది. షూటౌట్ లో 4-2తో భారత్ విజయం సాధించడంతో సెమీ ఫైనల్ కు అర్హత సాధించింది. సెమీ ఫైనల్స్‌లో అర్జెంటీనా లేదా జర్మనీతో భారత్ తలపడనుంది.

Next Story