ఆత్మ‌హ‌త్య చేసుకున్న క్రికెట‌ర్‌.. బ్లాక్‌బ్యాండ్స్‌తో మ్యాచ్ ఆడిన టీమిండియా

భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ జ్ఞాపకార్థం భారత జట్టు నలుపు రంగు బ్యాండ్ లు ధరించింది.

By Medi Samrat  Published on  20 Jun 2024 4:00 PM GMT
ఆత్మ‌హ‌త్య చేసుకున్న క్రికెట‌ర్‌.. బ్లాక్‌బ్యాండ్స్‌తో మ్యాచ్ ఆడిన టీమిండియా

భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్ డేవిడ్ జాన్సన్ జ్ఞాపకార్థం భారత జట్టు నలుపు రంగు బ్యాండ్ లు ధరించింది. గురువారం బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన T20 ప్రపంచ కప్ 2024 సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్లు నల్లటి బ్యాండ్‌లను ధరించారు.

టీమిండియా మాజీ క్రికెటర్‌, కర్ణాటక మాజీ రంజీ ఆటగాడు డేవిడ్‌ జాన్సన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులో తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ బాల్కనీ నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. జాన్సన్ 1996లో రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీశాడు. దేశీయ కెరీర్‌లో 39 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అతను 125 వికెట్లు పడగొట్టాడు. జాన్సన్ అత్యంత వేగవంతమైన భారతీయ బౌలర్లలో ఒకడుగా నిలిచాడు. 1995-96 రంజీ ట్రోఫీ సీజన్‌లో కేరళపై 152 పరుగులకు 10 వికెట్లు తీసుకున్నాడు. దీంతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. జాన్సన్‌ గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story