సెంచరీ కొట్టావు సంతోషం.. ఆ నోటి దూల ఎందుకు బ్రూక్.?

Harry Brook shuts down doubters in style. ఐపీఎల్ వేలంలో హ్యారీ బ్రూక్ ని సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది.

By M.S.R  Published on  15 April 2023 3:15 PM IST
సెంచరీ కొట్టావు సంతోషం.. ఆ నోటి దూల ఎందుకు బ్రూక్.?

Harry Brook


ఐపీఎల్ వేలంలో హ్యారీ బ్రూక్ ని సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో రూ. 13.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ తొలి మూడు మ్యాచ్ ల్లో అతను 13, 3, 13 స్కోర్లతో నిరాశ పరిచాడు. అతనిపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.. అయితే అందుకు తగ్గట్టుగా అతడు ఆడకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌ తో జరిగిన మ్యాచ్ లో బ్రూక్ సెంచరీతో అదరగొట్టాడు. కేవలం 55 బంతుల్లోనే ఈ సీజన్ లో తొలి శతకం సాధించాడు. జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. బ్రూక్ సరిగా ఆడలేదని బాధపడ్డామని.. ఇప్పుడు తన మార్క్ చూపించాడని పొగుడుతూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు వచ్చాయి.

అయితే బ్రూక్ మ్యాచ్ అనంతరం భారత అభిమానులపై నోరు పారేసుకున్నాడు. మొదటి కొన్ని మ్యాచ్ ల తర్వాత ఒత్తిడి ఉందని.. సోషల్ మీడియాలో నాపై ఎన్నో విమర్శలు వచ్చాయని తెలిపాడు. కోల్ కతాతో మ్యాచ్ లో నేను వాటిని ఏమాత్రం లెక్కచేయకూడదన్న మనస్తత్వంతో బరిలోకి దిగాను. మంచి ఇన్నింగ్స్ వచ్చింది. ఇప్పుడు చాలా మంది భారతీయ అభిమానులు నేను బాగా ఆడానంటూ పొగుడుతున్నారు. కానీ, వారంతా కొన్ని రోజుల క్రితం నన్ను తిట్టిపోశారు. నిజాయతీగా చెప్పాలంటే ఈ ఇన్నింగ్స్ తో వారి నోరు మూయించినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. ఒక్క ఇన్నింగ్స్ తో అతను ఇలా మాట్లాడటం సరికాదని.. అంత నోటి దూల అవసరం లేదని నెటిజన్లు అంటున్నారు.


Next Story