టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది

ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బీసీసీఐ సెక్రటరీ జే షా భారత జట్టు కొత్త వన్డే జెర్సీని ఆవిష్కరించారు.

By Kalasani Durgapraveen  Published on  30 Nov 2024 1:15 AM GMT
టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది

ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బీసీసీఐ సెక్రటరీ జే షా భారత జట్టు కొత్త వన్డే జెర్సీని ఆవిష్కరించారు. డిసెంబర్ 22 నుంచి వడోదరలో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మహిళల జట్టు ఈ కొత్త జెర్సీని ధరించనుంది. “ఈరోజు జెర్సీని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాము" అని హర్మన్‌ప్రీత్ ఆనందం వ్యక్తం చేశారు. టీమ్ ఇండియా జెర్సీని ధరించడం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదని హర్మన్‌ప్రీత్ అన్నారు, దానిని సొంతం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని తెలిపారు.

స్వదేశంలో జరిగే సిరీస్‌కు ముందు హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు డిసెంబర్ 5 నుండి 11 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇక ఫిబ్రవరి 6 నుండి ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు కొత్త జెర్సీని ధరించనుంది. మెన్స్ జట్టు కంటే ముందే భారత మహిళల జట్టు కొత్త జెర్సీతో అభిమానులను అలరించనున్నారు.

Next Story