ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. స్టార్ ఆల్‌రౌండ‌ర్ దూరం

Harmanpreet Kaur to lead Team India against Australia in T20I series.స్వ‌దేశంలో ఆస్ట్రేలియా మ‌హిళ‌ల‌తో త‌ల‌ప‌డే భార‌త

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Dec 2022 8:32 AM GMT
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. స్టార్ ఆల్‌రౌండ‌ర్ దూరం

స్వ‌దేశంలో ఆస్ట్రేలియా మ‌హిళ‌ల‌తో త‌ల‌ప‌డే భార‌త మ‌హిళ‌ల జ‌ట్టును బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) ప్ర‌క‌టించింది. 15 మందితో కూడిన జ‌ట్టును సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు. ఈ సిరీస్ కు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఆంధ్రా లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ అంజలి శర్వాని ని జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కించుకుంది. ఇక గాయంతో బాధ‌ప‌డుతున్న‌ స్టార్ ఆల్‌రౌండ‌ర్ పూజా వ‌స్త్రాక‌ర్‌కు విశ్రాంతి నిచ్చారు.

ఉమెన్స్ ఛాలెంజ‌ర్‌లో పూనమ్ యాదవ్ నేతృత్వంలోని ఇండియా ఎ త‌రుపున 25 ఏళ్ల ఆంధ్రా లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ అంజలి మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసింది. మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడిన అంజ‌లి మూడు వికెట్లు ప‌డ‌గొట్టింది. 5.50 ఎకాన‌మీతో బౌలింగ్ చేయ‌డం గ‌మనార్హం.

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముంబై వేదిక‌గా డిసెంబ‌ర్ 9న ఆరంభం కానుంది. డిసెంబ‌ర్ 11,14,17, 20 తేదీల్లో మిగిలిన మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తికా భాటియా (వికెట్ కీప‌ర్‌), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి, అంజలి వైద్య, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్.

Next Story
Share it