జులన్ గోస్వామి ఆఖరి మ్యాచ్.. కన్నీళ్లను ఆపుకోలేకపోయిన కెప్టెన్

Harmanpreet Kaur in tears as Jhulan Goswami plays her final match at Lord's. అంతర్జాతీయ క్రికెట్‌లో జులన్ గోస్వామి ఆఖరి మ్యాచ్ ఆడుతుండ‌గా..

By Medi Samrat  Published on  24 Sep 2022 1:34 PM GMT
జులన్ గోస్వామి ఆఖరి మ్యాచ్.. కన్నీళ్లను ఆపుకోలేకపోయిన కెప్టెన్

అంతర్జాతీయ క్రికెట్‌లో జులన్ గోస్వామి ఆఖరి మ్యాచ్ ఆడుతుండ‌గా.. ఆట ఆరంభానికి ముందు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న‌ మూడో వన్డే తర్వాత 39 ఏళ్ల జులన్ గోస్వామి కెరీర్‌కు గుడ్ బై చెబుతుంది.

ఆట ప్రారంభానికి ముందు భారత పేసర్ జులన్ గోస్వామికు ప్రత్యేక జ్ఞాపికను అందించారు. ప‌క్క‌నే ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ భావోద్వేగాన్ని ఆపుకోలేక‌పోయింది. 2009లో గోస్వామి కెప్టెన్సీలో 33 ఏళ్ల హర్మన్‌ప్రీత్ అరంగేట్రం చేసింది. దీంతో హర్మన్‌ప్రీత్ కౌర్ గ‌త స్మృతుల‌ను త‌లుచుకుని తీవ్ర భావోద్వేగానికి గురైన‌ట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాట్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా గోస్వామి రికార్డుల‌లోకి ఎక్కింది. గోస్వామి అత్య‌ధికంగా 353 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. 43 వికెట్లతో ప్రపంచ కప్‌లలో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డును కూడా కలిగి ఉంది.

తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా గోస్వామి మాట్లాడుతూ.. 2005, 2017 ప్రపంచకప్‌లలో రన్నరప్‌గా నిలవ‌డం తన కెరీర్‌లో విచారంగా మిగిలిపోయింద‌ని అన్నారు. నేను రెండు ప్రపంచకప్ ఫైనల్స్ ఆడాను కానీ ట్రోఫీని గెలవలేకపోయాను. మీరు నాలుగు సంవత్సరాల పాటు ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్నందున అది నా విచారం మాత్రమే. చాలా కష్టపడాల్సి వస్తుంది. ప్రతి క్రికెటర్‌కి.. ప్రపంచ కప్ గెలవడం కల సాకారమైన క్షణం అని ఆమె ఉద్వేగంగా మాట్లాడారు.


Next Story