టీమ్ఇండియా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీగా తనకు వచ్చే జీతం మొత్తాన్ని రైతు కుమారైల చదువులు, వారి సంక్షేమం కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపాడు. ఒక రాజ్యసభ సభ్యుడిగా.. రైతుల కుమారైల విద్య, సంక్షేమం కోసం నా జీతాన్ని వారికి అందించాలని అనుకుంటున్నా. మన దేశ అభివృద్దికి తోడ్పాడు అందించేందుకు నాకు చేతనైనంత సాయం నేను చేస్తాను అని హర్భజన్ సింగ్ ట్వీట్ చేశాడు. ఇక భజ్జీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. భజ్జీని ఆదర్శంగా తీసుకుని మరికొందరు ముందుకు రావాలని కామెంట్లు పెడుతన్నారు. కాగా.. గత నెల పంజాబ్ నుంచి రాజ్యసభకు హర్భజన్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.
ఇక క్రికెట్ విషయానికి వస్తే.. గతేడాది క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీమ్ఇండియా తరుపున 103 టెస్టులు, 236 వన్డేలకు, 28 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 417, వన్డేల్లో 269, టీ 20ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 163 మ్యాచుల్లో 150 వికెట్లు పడగొట్టాడు.