బిగ్‌బాస్‌-3 కంటెస్టంట్‌తో హ‌ర్భ‌జ‌న్ చిందులు.. సోష‌ల్ మీడియాలో ఫోటోలు వైర‌ల్

Harbhajan Singh shares his debut movie still.భార‌త వెట‌ర‌న్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ త్వ‌ర‌లోనే వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్నాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Feb 2021 1:31 PM GMT
Harbhajan Singh shares his debut movie still

భార‌త వెట‌ర‌న్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ త్వ‌ర‌లోనే వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్నాడు. లుంగీ కట్టి, కళ్లజోడు పెట్టుకుని హీరోయిన్‌తో కలిసి భ‌జ్జీ స్టెప్పులు వేశాడు. ప్ర‌స్తుతం హ‌ర్భ‌జ‌న్ 'ఫ్రెండ్ షిప్' అనే త‌మిళ చిత్రంలో న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర ఆఖ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. ఈ క్రమంలో ఓ పాట షూటింగ్‌ చేశారు. ఈ షూటింగ్‌లో భాగంగా భజ్జీ మాస్‌ స్టైల్‌ లుక్‌లో కనిపించాడు. అందుకు సంబంధించిన ఫోటోల‌ను భ‌జ్జీ సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు.

ఈ చిత్రం వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలిపాడు. ఈ సందర్భంగా భజ్జీ భావోద్వేగానికి లోనయ్యాడు. 'తమిళనాడు నన్ను తల్లిలా ఆదరించింది' అని తమిళంలో ట్వీట్‌ చేశాడు. గతంలో చెన్నె సూపర్‌ కింగ్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా హర్బజన్‌ సింగ్‌ గుర్తుచేసుకున్నాడు. బిగ్‌బాస్‌-3 ఫేమ్‌ లోస్లియా భజ్జీకి జోడీగా నటిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ లోస్లియాతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న ఫొటోలు వైరల్‌గా మారాయి.


అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూర‌మైన భ‌జ్జీ.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో యూఏఈలో జ‌రిగిన 13వ సీజ‌న్‌కు దూర‌మ‌య్యాడు. చెన్నై జ‌ట్టు హ‌ర్భ‌జ‌న్‌ను వేలానికి విడిచిపెట్టిన సంగ‌తి తెలిసిందే. 18న జ‌రిగే వేలంలో భ‌జ్జీని ఏ జ‌ట్టు ద‌క్కించుకుంటుందో చూడాలి మ‌రీ.


Next Story