మరో మైలు రాయిని అధిగమించిన గుకేశ్ దొమ్మరాజు..ఈసారి వరల్డ్ నెంబర్ వన్‌కే షాక్
నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించారు.
By - Knakam Karthik |
మరో మైలు రాయిని అధిగమించిన గుకేశ్ దొమ్మరాజు..ఈసారి వరల్డ్ నెంబర్ వన్‌కే షాక్
నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించారు. వరల్డ్ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై విక్టరీ సాధించారు. ఇది గుకేష్ కెరీర్‌లో క్లాసికల్ టైమ్ కంట్రోల్‌లో కార్ల్‌సన్‌పై వచ్చిన తొలి గెలుపు కావడం విశేషం.ఆదివారం ఆర్థరాత్రి దాటాక జరిగిన ఈ టోర్నీ ఆరో రౌండ్‌లో కార్ల్‌సన్‌ను గుకేష్ ఓడించారు. ఆఖరివరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ గేమ్‌లో గుకేష్ పై చేయి సాధించారు.
ఆరో రౌండ్‌లో గుకేశ్ ప్రపంచ చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్‌సన్‌పై విజయం సాధించారు. అయితే మాజీ ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సన్ ఇప్పటికే ఐదు సార్లు విజేతగా నిలిచాడు. టోర్నమెంట్ ప్రారంభం నుంచే గుకేష్‌కి బలమైన సవాల్ విసిరిన కార్ల్‌సన్, ఆరో రౌండ్‌లో మాత్రం గుకేష్ ఎదుట తడబడిపోయాడు. ఎండ్‌గేమ్ సమయానికి 34 ఏళ్ల కార్ల్‌సన్ చేసిన ఒక చిన్న తప్పిదాన్ని గుకేష్ చక్కగా ఉపయోగించుకున్నాడు. ఫలితంగా ముగింపు దశలోనే గేమ్‌ను తనవైపు తిప్పుకున్నాడు.
ఈ గెలుపుతో గుకేష్ మూడు విలువైన పాయింట్లు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అతని స్కోరు 8.5 పాయింట్లు కాగా, రెండో స్థానంలో ఉన్న అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానాకు కేవలం ఒక పాయింట్ తక్కువగానే ఉన్నాడు. ఈ విజయం గుకేష్‌ను నార్వే చెస్‌లో మూడో స్థానానికి తీసుకువచ్చింది. ఇక ఓటమిని తట్టుకోలేక కార్ల్‌సన్ పిడికిలితో ఒక్కసారిగా చెస్‌బోర్డు టేబుల్‌ను గట్టిగా కొట్టాడు. వెంటనే గుకేశ్‌కు సారీ చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
That moment when World Champion @DGukesh won his game against World no.1 Magnus Carlsen! Video: @adityasurroy21/ ChessBase India#chess #chessbaseindia #norwaychess #gukesh pic.twitter.com/9YQhHYlia0
— ChessBase India (@ChessbaseIndia) June 1, 2025