టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ లెవెన్ లో ఉన్నది ఎవరంటే..?

Gujarat Titans opt to bowl. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్ క్వాలిఫయర్-1లో నేడు గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్

By Medi Samrat  Published on  23 May 2023 7:23 PM IST
టాస్ గెలిచిన గుజరాత్.. ప్లేయింగ్ లెవెన్ లో ఉన్నది ఎవరంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్ క్వాలిఫయర్-1లో నేడు గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టోర్నీలోని తొలి మ్యాచ్‌ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లే క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో కూడా తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు.. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో తలపడుతుంది. అందులో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. వాటిలో గుజరాత్ టీమ్ మొత్తం 3 మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌ మీద చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. గుజరాత్ టైటాన్స్ ఈ టోర్నీ మొత్తం కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబర్చింది. ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లు గెలిచి, నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడిన చెన్నై 8 విజయాలతో ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి డైరెక్ట్ గా ఫైనల్ కు వెళ్లాలని చెన్నై ఉవ్విళ్లూరుతోంది.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(w), హార్దిక్ పాండ్యా(c), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ


Next Story