'గో బ్యాక్ టు స్కూల్ అండ్ లెర్న్ కెప్టెన్సీ'.. గిల్‌పై మాజీ క్రికెటర్ ఫైర్..!
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు 1-2తో కోల్పోయింది. అప్పటి నుంచి భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
By - Medi Samrat |
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత జట్టు 1-2తో కోల్పోయింది. అప్పటి నుంచి భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిల్ కెప్టెన్సీలో భారత్.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అయితే.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి భారత జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే విజిటింగ్ టీమ్ కీలక ఆటగాళ్లు లేకుండానే వచ్చింది. కేన్ విలియమ్సన్, ఇష్ సోధి, లోకి ఫెర్గూసన్, టామ్ లాథమ్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ వంటి ఆటగాళ్లు పర్యటనకు రాలేదు. అయినా న్యూజిలాండ్ జట్టు భారత్‌లో వన్డే సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలోనే మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్ బాసిత్ అలీ శుభ్‌మన్ గిల్‌పై విరుచుకుపడ్డాడు. యూట్యూబ్ షో 'ది గేమ్ ప్లాన్'లో బాసిత్ అలీ మాట్లాడుతూ.. 'న్యూజిలాండ్ విజయం సాధించిన ఘనత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అతని కెప్టెన్సీకి చెందుతుంది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, షమీ లేకుండానే భారత జట్టు సిరీస్‌లోకి వచ్చింది. ఎవరినీ ఎంపిక చేయలేదు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు భారత్‌కు బలం. రాహుల్ రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేశాడు. అయితే మూడో మ్యాచ్‌లో తొందరగానే ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఏం చేశారు? అని ప్రశ్నించాడు. బాసిత్ అలీ ఫైర్ అవుతూ.. శుభ్‌మన్ గిల్‌ను మొదటి నుండి కెప్టెన్సీ నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. గిల్ కెప్టెన్సీ తప్పిదాన్ని బాసిత్ ఎత్తి చూపాడు. మొదటి వన్డేలో న్యూజిలాండ్ దాదాపు 300 పరుగుల లక్ష్యాన్ని సాధించినప్పుడు వారి లక్ష్యం నిర్దేశించబడింది. మనం ఫాస్ట్ బౌలర్లను మినహాయిస్తే.. భారత ప్రధాన బౌలర్ ఎవరు? కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రూపంలో మీకు స్పెషలిస్ట్ బౌలర్లు కూడా ఉన్నారు. కానీ మీరు వారి కంటే ముందు నితీష్ రెడ్డిని బౌలింగ్‌కు దింపారు. షాన్ మసూద్‌ను అనుకరించేందుకు శుభ్‌మన్ గిల్ ప్రయత్నించాడని.. డ్రెస్సింగ్ రూమ్ నుండి ఎలాంటి సందేశాలు వచ్చినా అనుసరించడానికి మీకు త్వరగా వికెట్లు కావాలి.. నేను గిల్‌కి నమస్కరిస్తున్నాను.. మళ్లీ స్కూల్‌కు వెళ్లి కెప్టెన్సీ నేర్చుకోండి అంటూ కామెంట్స్ చేశాడు.