ప్రేయ‌సిని పెళ్లాడిన విధ్వంస‌క‌ర వీరుడు

Glenn Maxwell marries girlfriend Vini Raman.ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఆట‌గాడు, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కీల‌క

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2022 1:04 PM IST
ప్రేయ‌సిని పెళ్లాడిన విధ్వంస‌క‌ర వీరుడు

ఆస్ట్రేలియా విధ్వంస‌క‌ర ఆట‌గాడు, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కీల‌క ప్లేయ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఓ ఇంటివాడు అయ్యాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)2022 సీజ‌న్ ముందు త‌న ప్రియురాలు, భార‌త సంత‌తికి చెందిన వినీ రామ‌న్‌ను వివాహ‌మాడాడు. ఈ విష‌యాన్ని కొత్త జంట త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌ల ద్వారా వెల్ల‌డించింది. రింగులు మార్చుకున్న ఫోటోల‌ను షేర్ చేస్తూ.. 'లవ్‌ అనే పదాన్ని ఈ రోజుతో పూర్తి చేశాను. ఒక పెద్ద ఘట్టం ముగిసింది.. కొత్త జీవితం ఆరంభమవుతుంది'అంటూ మాక్సీ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

త‌మిళ‌నాడు చెందిన వినీ రామ‌న్ ఆస్ట్రేలియాలో పార్మ‌సిస్ట్‌గా ప‌నిచేస్తోంది. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచయం ప్రేమ‌గా మారింది. ఈ క్ర‌మంలో ఫిబ్రవరి 2020లో మ్యాక్సీ, వినీ రామన్‌లు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. అయితే.. క‌రోనా లాక్‌డౌన్‌, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల పెళ్లిని వాయిదా వేస్తూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు ఈ జంట శ‌నివారం ఒక్క‌టైంది.

ఓ ఇంటివాడైన మ్యాక్స్‌వెల్‌కు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో పాటు అభిమానులు, ఆట‌గాళ్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వేళ ఈ ఇద్దరికి ఆల్‌ ది బెస్ట్‌.. మీ జీవితం హయిగా, ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటున్నాం అంటూ ఆర్‌సీబీ ట్వీట్ చేసింది. ఐపీఎల్‌ 2022 సీజన్ మెగా వేలానికి ముందే ఆర్‌సీబీ.. మ్యాక్స్‌వెల్‌ను రూ.11 కోట్లతో రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి కార‌ణంగా పాక్ ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్న మ్యాక్స్‌వెల్.. ఐపీఎల్‌లో ఆడ‌నున్నాడు.

Next Story